ప్రత్యేక అధికారులు మండల కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించాలి పాఠశాలలు, కేజీబీవీలు, పంచాయతీలు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించాలి: జిల్లా కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట, ఆగస్టు 14 (నవపక్షం, నారాయణపేట ప్రతినిధి): నారాయణపేట జిల్లాలో ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. కొడంగల్ నియోజకవర్గంలోని గుండుమాల్‌తో పాటు వివిధ మండలాల్లో నెలకొన్న సమస్యలను...