80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధి, సమగ్ర ప్రగతి కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా...