రాజీవ్ గృహకల్పలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నవపక్షం, నిజాంపేట్ సర్కిల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి మండలం నిజాంపేట్ సర్కిల్–275 పరిధిలో గల రాజీవ్ గృహకల్పలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు తోట బిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజు యాదవ్, నిజాంపేట్ సర్కిల్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు వాకలపూడి రంగారాయ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ తల్లి...