ఆవల్గొన్ గ్రామంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నవపక్షం, ఆవల్గొన్: ఆవల్గొన్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మన్య భాయి, ఉపసర్పంచ్ విజయ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగ్నాథ్ పాటిల్, మాజీ ఎంపీటీసీ సైలు, గ్రామపంచాయతీ కార్యదర్శి సతీష్, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు,...