భువనగిరిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కుకుటపు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో భువనగిరిలోని IVF కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి IVF, IHRCI సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా IVF యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుకుటపు చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. అలాగే సమాజ సేవకు సంబంధించిన మరిన్ని కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు....