దమ్మపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నవపక్షం, దమ్మపేట, ఆగస్టు 15: దమ్మపేట మండలం, దమ్మపేట గ్రామంలోని జనసేన దిమ్మ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు దేశభక్తి ఉట్టిపడేలా వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా జనసేన నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు...