నారాయణపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నవపక్షం, నారాయణపేట జిల్లా ప్రతినిధి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నారాయణపేట శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నారాయణపేట చౌక్ బజార్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ మంజుల హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను ప్రతిరోజూ స్మరించుకుంటూ, వారి ఆశయాలు, అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని...