తంగడపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు: మాజీ సర్పంచ్ దయాకరాచారి
నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి 4వ వార్డులో మాజీ సర్పంచ్ దయాకరాచారి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజల సమక్షంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దయాకరాచారి మాట్లాడుతూ, నేటి విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ...