దేశభక్తి స్ఫూర్తితో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిజాంపేట్ సర్కిల్‌లో ఘనంగా జెండా వందన కార్యక్రమాలు
నిజాంపేట్: స్వాతంత్ర్యం మనకు లభించిన వరం కాదని, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మన నిజమైన దేశభక్తి అని నిజాంపేట్ సర్కిల్ బీఆర్‌ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ సాంబశివరెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జెండా వందన కార్యక్రమాలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ప్రగతినగర్ జగన్ స్టూడియో సర్కిల్ సమీపంలోని అమరవీరుల స్థూపం, ఛత్రపతి శివాజీ పార్క్, ప్రభుత్వ జడ్పీహెచ్ హైస్కూల్, సాయినగర్ కమిటీ హాల్,...