ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసిన అంకిరెడ్డిగూడెం గ్రామ పాలకవర్గం డంపింగ్ యార్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని వినతి

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామ పాలకవర్గ సభ్యులు, అఖిలపక్ష నాయకులు మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 326లో చౌటుప్పల్ మున్సిపాలిటీ నుంచి సేకరించిన చెత్త, వ్యర్థాలను తరలించి వేసేందుకు డంపింగ్ యార్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని గ్రామ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే...