హనుమకొండలో జాతీయ జెండాను ఆవిష్కరించిన చందుపట్ల సత్యపాల్ రెడ్డి
నవపక్షం, హనుమకొండ ప్రతినిధి : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చందుపట్ల సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమగ్ర...