వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయండి – జిల్లా కలెక్టర్ సిహెచ్. ప్రియాంక
నారాయణపేట జిల్లాలోని రైతు సోదరులు వానాకాలం–2026 సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తగా వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. ప్రియాంక సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగు చేసి నష్టపోయే కంటే, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో బావులు,...