జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట జిల్లా ప్రతినిధి | ఆగస్టు 15, 2026:   80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాలు, ఆశయాలను స్ఫూర్తిగా...