ఆహార పరిరక్షణ విభాగంలో ఉత్తమ జిల్లా అధికారిగా డా. ఎన్. శివశంకర్ రెడ్డికి ప్రశంసా పురస్కారం
నవపక్షం, నల్గొండ | ఆగస్టు 15: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ జిల్లా ఆహార పరిరక్షణ అధికారి డా. ఎన్. శివశంకర్ రెడ్డి ఉత్తమ జిల్లా అధికారి విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యారు. జిల్లాలో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా ఆహార పరిరక్షణ విభాగం విధులను సమర్థవంతంగా నిర్వహించడంలో డా. శివశంకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆహార భద్రతా ప్రమాణాల అమలు, తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో ఆహార...