త్యాగధనుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ సేవకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, ఐపీఎస్
నారాయణపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణపేట జిల్లా ప్రజలకు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేయడం వల్లే నేడు దేశ ప్రజలంతా స్వేచ్ఛగా...