భీష్మరాజ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, పాట విడుదల, మొక్కలు నాటే కార్యక్రమం
నారాయణపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కేంద్రంలోని కాశీనాథేశ్వర కాలనీలో ఉన్న భీష్మరాజ్ ఫౌండేషన్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కరాటే విద్యార్థులు, కాలనీ వాసులు, గ్రామస్తులు, భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డిపై రూపొందించిన నూతన పాట...