ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నవపక్షం, బాలానగర్ ప్రతినిధి : మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములమవుతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. యువతే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు...