నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి భూములు కోల్పోతున్న నిజమైన రైతులకు న్యాయం చేయాలి రాజకీయ నాటకాలు ఆపి ప్రాజెక్ట్‌ను నాణ్యతతో పూర్తి చేయాలి – తెలంగాణ రక్షణ సేన పార్టీ, నారాయణపేట జిల్లా

నారాయణపేట: నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రభుత్వ భూముల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఎస్. రాజేందర్‌రెడ్డి తదితరులు తెలంగాణ లోకాయుక్తను ఆశ్రయించిన నేపథ్యంలో, ప్రాజెక్ట్ పరిధిలోని ప్రభుత్వ భూముల వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ–నారాయణపేట జిల్లా డిమాండ్ చేసింది. ప్రత్యేకంగా పేరపల్ల ప్రాంతంలోని ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోందని పార్టీ పేర్కొంది. అధికారుల సమాచారం ప్రకారం దాదాపు 100 ఎకరాల...