మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఘన సన్మానం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి: ఏఎంసీ చైర్మన్ గంట సంజీవరెడ్డి
నవపక్షం, కేసముద్రం ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ కేసముద్రం మండల అధ్యక్షుడిగా చిలువేరు సమ్మయ్య గౌడ్ నియమితులైన సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ, చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఉన్న ప్రజాసేవ అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని అన్నారు. సీనియర్ నాయకుల సూచనలు, అనుభవాలను తీసుకుంటూ కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు....