రహమతాబాద్ దర్గాలో వైభవంగా నిషాన్ మహోత్సవం మత సామరస్యానికి ప్రతీకగా ఘనంగా జెండా ప్రతిష్ఠాపన
నవపక్షం, అనుమసముద్రంపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: భక్తిశ్రద్ధలకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర రహమతాబాద్ దర్గాలో నిషాన్ మహోత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభ మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మహల్ నుంచి ఘనంగా నిషాన్ల తరలింపు నిషాన్ మహోత్సవంలో భాగంగా మహల్ నుంచి ప్రత్యేకంగా సిద్ధం చేసిన నిషాన్లను (జెండాలను) భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకువచ్చారు. బాణాసంచా కాల్పులు, ఫకీర్ల బురుజులు, నాతేఖాన్‌ల గానాలతో ఈ...