80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు డా. సాయి రమేష్ పిలుపు ప్రజల హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలన, మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతాం

నవపక్షం, విశాఖపట్నం, ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఆగస్టు 15న నిర్వహించుకుంటున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని అంబేద్కర్ నగర్, సీతమ్మధార ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ కమిటీ సభ్యులు, ప్రజలు, స్థానిక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డా. సాయి రమేష్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు,...