80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్త డా. స్వాతికి ప్రశంస పత్రం

నవపక్షం, పొలాస: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పొలాస పరిశోధన స్థానం నుంచి విశిష్ట సేవలు అందిస్తున్న శాస్త్రవేత్త డా. స్వాతికి ప్రశంస పత్రం అందజేశారు. గౌరవ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, గౌరవ ఎమ్మెల్యే సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ చేతుల మీదుగా డా. స్వాతి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. పరిశోధన రంగంలో డా. స్వాతి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ ప్రశంస పత్రాన్ని అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆమెను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింతగా పరిశోధనలు చేసి...