ప్రగతి నగర్ ఆటో డ్రైవర్స్ యూనియన్ (CITU) అధ్యక్ష ఎన్నికల్లో ఎల్. బాబు నాయక్ విజయం

ప్రగతి నగర్, ఆగస్టు 15: మేడ్చల్–మల్కాజ్గిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి మండలం ప్రగతి నగర్‌లో ఆటో డ్రైవర్స్ యూనియన్ (CITU) అధ్యక్ష పదవికి ఆగస్టు 15న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎల్. బాబు నాయక్, ఏ. మహేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. యూనియన్‌లో మొత్తం 110 మంది ఓటర్లు ఉండగా, 107 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలైన ఓట్లలో ఒక ఓటు చెల్లనిదిగా ప్రకటించగా, చెల్లిన 106 ఓట్లలో ఎల్. బాబు నాయక్‌కు 54 ఓట్లు, ఏ. మహేశ్వర్ రెడ్డికి...