తాజ్‌పూర్ గ్రామంలో ఘనంగా 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్
తాజ్‌పూర్: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తాజ్‌పూర్ గ్రామంలో శనివారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గౌరవ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. సర్పంచ్ అధ్యక్షతన గ్రామపంచాయతీ ఆవరణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లి పాల వారోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామసభ నిర్వహించిన అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, గాంధీ చౌరస్తా, వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం...