కల్తీ, కుళ్లిపోయిన బెల్లంపై టాస్క్‌ఫోర్స్ దాడి – 7,500 కిలోల బెల్లం స్వాధీనం

వికారాబాద్ జిల్లా, ఆగస్టు 15: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు జిల్లాలో నిబంధనల ఉల్లంఘనలపై టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కె. అన్వార్ పాషా ఆధ్వర్యంలో బంట్వారం మండలం బోపనారం గ్రామ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తాండూర్‌కు ఆటోలో తరలిస్తున్న సుమారు 4 క్వింటాళ్ల కల్తీ, కుళ్లిపోయిన బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో ఉన్న చంద్ పాషా, డ్రైవర్ మొహమ్మద్ కుతుబొద్దీన్‌లను విచారించగా, వారి దుకాణంలో కూడా కల్తీ, కుళ్లిపోయిన...