పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – ఫుడ్ సెక్యూరిటీ స్మార్ట్ కార్డులతో పారదర్శకంగా రేషన్ సరఫరా – ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యం – మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ సెక్యూరిటీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య...