దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డిలకు ఘన నివాళులు
నవపక్షం, ధన్వాడ ప్రతినిధి : దివంగత మక్తల్ ఎమ్మెల్యే శ్రీ చిట్టెం నర్సిరెడ్డి 21వ వర్ధంతి, ఆయన కుమారుడు స్వర్గీయ చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు చిట్టెం కుటుంబ సభ్యులు స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డిల చిత్రపటాలకు...