దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డిలకు ఘన నివాళులు
నవపక్షం, ధన్వాడ ప్రతినిధి: దివంగత మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి 21వ వర్ధంతి, ఆయన కుమారుడు చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు ఎంపీ డీకే అరుణ, మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి స్వర్గీయులు చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ అంజలి ఘటించారు. ఈ...