చిట్టెం నర్సిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ప్రజా సేవలోనే ప్రాణాలు కోల్పోయిన ప్రజా నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి: ఎంపీ డీకే అరుణ

నారాయణపేట: దివంగత మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ప్రజా నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె, ఎంపీ డీకే అరుణ ఘనంగా నివాళులర్పించారు. చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, చిట్టెం నర్సిరెడ్డి స్మృతి వనం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, ప్రజా నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి నారాయణపేట జిల్లాతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజా జీవితానికే అంకితమై,...