చౌటుప్పల్‌లో మహిళ హత్య కేసు ఛేదన పెళ్లికి నిరాకరించడంతో ఘర్షణ.. కర్రతో తలపై కొట్టి హత్య నిందితుడు సయ్యద్ బషీర్ అరెస్ట్.. జుడీష్యల్ రిమాండ్‌కు తరలింపు

నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 15: చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన ఎం.డి. సలీమా (38) అదృశ్యమైన కేసును చౌటుప్పల్ పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 25న ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సలీమా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి ఎం.డి. పెద్ద సైదాబీ ఆగస్టు 1న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ బషీర్ (37)ను పోలీసులు...