దేశాభివృద్ధికి యువతే బలం – సోషల్ మీడియా అసత్య ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – బీజేపీ మల్కాజ్‌గిరి జిల్లా ప్రెసిడెంట్ డి. గిరి వర్ధన్ రెడ్డి
మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు డి. గిరి వర్ధన్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి. గిరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం మనకు లభించిన హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును మరింత బలంగా నిర్మించాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడిపై...