ఘనంగా చెంగిచర్ల గాంధీనగర్ బోనాల పండుగ
నవపక్షం, చెంగిచర్ల : చెంగిచర్ల గాంధీనగర్ కాలనీలో బోనాల పండుగను యువకులు, కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని పండుగ కార్యక్రమాలను విజయవంతం చేశారు. బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు గాంధీనగర్ యువకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు....