23 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
నవపక్షం, పిట్లం ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 23 మంది విద్యార్థులను మెమెంటోలు, నగదు ప్రోత్సాహకాలతో ఘనంగా సత్కరించారు. కీ. శే. నవాబ్ మహిపాల్ గౌడ్ జ్ఞాపకార్థం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ ప్రోత్సాహకాలను అందజేశారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ...