వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి:  మునుగోడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో మునుకుంట్ల సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలకాలం అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. నూతన దాంపత్య జీవితానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.