పేదల సంక్షేమ పథకాలను కాపాడుకోవడం మన హక్కు – ప్రజల హక్కుల కోసం పోరాడటం మన బాధ్యత

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలో పేదల సంక్షేమానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలిచిపోయే విధంగా కోర్టు ఆదేశాలు వెలువడటానికి కారణమైన ప్రభుత్వ చేతగానితనాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ ధరూర్ మండలం మాజీ అధ్యక్షులు పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం, 17-08-2026 ఉదయం 9:30 గంటలకు ధరూర్ మండల పరిషత్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను పరిరక్షించాల్సిన...