‘మట్టి… మహిళ… మనిషి…’తో సాహిత్య ప్రస్థానంలో నక్క శ్రీనివాస్

నవపక్షం, నాంపల్లి ప్రతినిధి:  గ్రామీణ నేపథ్యం నుంచి సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేస్తున్న వర్ధమాన కవి నక్క శ్రీనివాస్ మరో కీలక మైలురాయిని అధిగమించనున్నారు. ఆయన రచించిన “మట్టి… మహిళ… మనిషి…” కవితా సంకలనం ఈ నెల 17న హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక రవీంద్ర భారతిలో ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ సంస్థ (SBTET) కార్యదర్శి...