కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్
దమ్మపేట -నవ పక్షం :- శివాజీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు రాష్ట్రంలో నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఈ పథకాలను కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా హక్కు కల్పించి అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. ఆదివారం సిఐటియు మండల కమిటీ సమావేశం బత్తుల శ్రీను అధ్యక్షతన స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కళ్యాణ్ లక్ష్మి పథకం విషయంలో హైకోర్టు తీర్పు వెలువడిందని, కళ్యాణ్ లక్ష్మి...