బెస్ట్ ఎంప్లాయి
దమ్మపేట మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామంలో అసిస్టెంట్ లైన్మెన్ గా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ ముజాహిద్ పాషా కు అశ్వరావుపేట నియోజకవర్గం స్థాయి ఉత్తమ ఉద్యోగి అవార్డును ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందించటం జరిగింది. అసిస్టెంట్ లైన్మెన్ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే జారే అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి విద్యుత్ శాఖ అధికారులు మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు.