యాదగిరిగుట్ట పట్టణంలో నాణ్యత లేని పనులు కాంట్రాక్టర్ కు లబ్ది చేకూర్చేలా ఉన్నాయి కర్రే ప్రవీణ్ బీజేపీ

యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గుండ్లపాల్లి ,అంగడి కింద ఉన్నటువంటి సిసి రోడ్ , అమృత్ వాటర్ పైప్ లైన్ లను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ కేంద్రం పట్టణ అభివృద్ధి కోసం 25 కోట్లు సీసీ రోడ్ ల కోసం తాగునీటి కోసం 40 కోట్లను అమృత్ స్కీమ్ లో భాగంగా కేటాయించడం జరిగింది యాదగిరిగుట్టలో కాంట్రాక్టర్లది ఇష్టారాజ్యంగా నడుస్తుంది వీళ్ళు పెద్ద పెద్ద నాయకులకు బినామీలుగా ఉండి చేసినటువంటి పనులలో నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారు...