ఆపదలో అండగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ సమ్మయ్య గౌడ్
నవపక్షం, కేసముద్రం మండల ప్రతినిధి : ప్రజల కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సోమారపు సామెల్ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని సమ్మయ్య గౌడ్ పరామర్శించారు. మృతుడి భార్య ముత్తమ్మ, కుమారుడు యాకుబ్‌ను పరామర్శించి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా...