ఉత్తమ తహసీల్దార్ వీరబాయ్‌కు ఘన సన్మానం
నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 17: చౌటుప్పల్ మండలంలో ప్రజలకు వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్తమ తహసీల్దార్‌గా ఎంపికై, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్న తహసీల్దార్ వీరబాయ్‌ను చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. జిల్లాలో ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు అందుకోవడం పట్ల వీరబాయ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కడం అభినందనీయమని పేర్కొన్నారు....