వనస్థలిపురం కాంప్లెక్స్ సముదాయంలో ఘనంగా లింగాల నరేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు
నవపక్షం, ఎల్బీనగర్, ఆగస్టు 17: తొలివార్త దినపత్రిక ఎడిటర్ రింగాల నరేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు సోమవారం ఉదయం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం కాంప్లెక్స్ సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు లింగాల నరేందర్ గౌడ్‌ను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను అభినందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం లింగాల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు చూపించిన ఆదరాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని తెలిపారు....