గోరికొత్తపల్లి మండలంలో సుల్తాన్పూర్ లో మూడేళ్లు గడిచినా పూర్తికాని రైతు వేదిక బాత్రూములు

సుల్తాన్పూర్ : రైతుల సౌకర్యార్థం నిర్మించిన రైతు వేదికకు మూడేళ్లు పూర్తయినా, అక్కడ నిర్మించిన బాత్రూములు మాత్రం ఇప్పటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. బాత్రూముల నిర్మాణం పూర్తికాకపోవడంతో రైతులు, రైతు వేదికకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బాత్రూముల నిర్మాణం కోసం గోడలు నిర్మించినప్పటికీ తలుపులు, ఇతర అవసరమైన పనులు పూర్తి చేయకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. మరోవైపు రైతు వేదిక పరిసరాల్లో పరిశుభ్రత లోపించడంతో చెత్తాచెదారం పేరుకుపోయి అధ్వానంగా మారింది.మూడేళ్లు గడిచినా పనులు ఎందుకు పూర్తికాలేదని, నిధులు కేటాయించినా...