ప్రజాప్రతినిధుల ఆగ్రహం నాసిరకం భోజనం.. కుళ్లిన కూరగాయలు.. మెనూకు తిలోదకాలు విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
దమ్మపేట - నవ పక్షం:- దమ్మపేట: -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జార ఆదినారాయణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం, వంటగది, సరుకుల నిల్వ గది, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. తనిఖీల్లో వంటగదిలో అన్నం సరిగా ఉడకకపోవడం, నిర్ణయించిన ఆహార పట్టిక ప్రకారం వంటలు చేయకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. అంతేకాకుండా మధ్యాహ్నం తయారు చేసిన...