భువనగిరి లో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో SIR ఫేజ్-2 సన్నాహక సమావేశం.*
భువనగిరి: భువనగిరి పట్టణంలోని న్యూ వివేర కన్వెన్షన్ హాల్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ఫేజ్-2 సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నటరాజన్ మీనాక్షి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో SIR ఫేజ్-2 ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ శ్రేణుల...