భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

  అశ్వారావుపేట - నవపక్షం :- బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాటి మొఘల్ సుల్తాన్లు, స్థానిక భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా స్వంతంగా ఖిలాషాపూర్ రాతి కోటను నిర్మించి స్వయంపాలనను సాధించిన గొప్ప విప్లవ వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. కుల, మత వ్యత్యాసాలు లేకుండా...