విద్యార్థులకు ప్లేట్లు వితరణ
చర్ల - నవపక్షం:- చర్ల మండల పరిధిలోని సాయి నగర్ కాలనీలో ఉన్నటువంటి వనవాసి గిరిజన పాఠశాల మరియు హాస్టల్లో ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా చర్ల సర్పంచ్ భర్త అయినా వల్లే శ్రీకాంత్ ఆహారపు ప్లేట్లు వితరణ చేశారు. సర్పంచ్ దంపతులు విద్యార్థుల ఉద్దేశించి వారి యొక్క చదువు గురించి అదే విధంగా వారి యొక్క వసతులు మరియు వాటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు సర్పంచ్ దంపతుల స్నేహితులు పాల్గొన్నారు.