సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తిదాయకం.జయంతి కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...