దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లెక్చరర్ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేసి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి — విద్యార్థి సంఘాల డిమాండ్

దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న భాస్కర్ బాలికల పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం BRSV, ABVP, SFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యార్థినుల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ భాస్కర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భాస్కర్‌పై వచ్చిన ఆరోపణలపై...