బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాడాలి సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్
నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: దేవరకొండ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సామాజిక కార్యకర్తలు, మహిళలు, మేధావులు, కార్మికులు, కర్షకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర...